నల్లగొండ :రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించిన తెలంగాణ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం మంత్రి జగదీశ్ రెడ్డికి లేఖ రాశారు.
వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలి
Aug 1 2016 8:22 PM | Updated on Aug 30 2019 8:37 PM
నల్లగొండ :రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించిన తెలంగాణ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం మంత్రి జగదీశ్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ప్రమాదకర పరిశ్రమల నుంచి సేకరించిన చెత్తను ఈ ప్రాంతానికి తరలించి వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్‌లో నిల్వ చేసే విధంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను తక్షణమే రద్దుచేయాలని ఆయన లేఖలో కోరారు. మంత్రికి రాసిన లేఖ ప్రతిని సోమవారం మీడియాకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల కక్కిరేణితో పాటు ఇతర గ్రామాల ప్రజలు అనారోగ్యాల బారిన పడడంతో పాటు ఆరోగ్యపరంగా అనేక రోగాలు వచ్చే అవకాశాలున్నాయని పర్యావరణ వేత్తలు, వైద్యులు పేర్కొంటున్నారని పేర్కొన్నారు. గాలి, నీరు, మట్టి కలుషితం కావడంతో పాటు దీనిని మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఇంజినీర్లు సైతం ప్రతిపాదనలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఎమ్మెల్యే రాసిన లేఖ ప్రతి పై నార్కట్‌పల్లి ఎంపీపీ రేగెట్టె మల్లికార్జునరెడ్డి, చిట్యాల జెడ్పీటీసీ రవీందర్, టీఆర్‌ఎస్ నాయకులు సంతకాలు చేశారు.
Advertisement
Advertisement