భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా | wife strikes at husbands house | Sakshi
Sakshi News home page

భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా

Apr 19 2017 12:07 AM | Updated on Sep 5 2017 9:05 AM

భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా

భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా

పెళ్లి చేసుకుని ఆ తరువాత ఇంట్లోకి రానివ్వకుండా వేధిస్తున్న భర్త, అత్తమామాల నుంచి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ అభాగ్యురాలు ఆందోళనకు దిగింది.

కొత్తచెరువు(పుట్టపర్తి) : పెళ్లి చేసుకుని ఆ తరువాత ఇంట్లోకి రానివ్వకుండా వేధిస్తున్న భర్త, అత్తమామాల నుంచి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ అభాగ్యురాలు ఆందోళనకు దిగింది. ఏకంగా అత్తారింటి ఎదుటే ఆమె ధర్నాకు కూర్చుంది. ముదిగుబ్బ మండలం రామిరెడ్డిపల్లికి  చెందిన స్రవంతి వివాహం కొత్తచెరువుకు చెందిన శివారెడ్డి కుమారుడు ఓం ప్రకాష్‌రెడ్డికి 2015లో అయింది. పెళ్లైన కొద్ది రోజులకే స్రవంతిని పుట్టింటికి తరిమేశారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెను భర్త కాపురానికి  పిల్చుకోలేదు. గతంలోనే ఓం ప్రకాష్‌కు పెళ్లి జరిగిందని, అయితే అ విషయం దాచిపెట్టి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించారు. స్రవంతి ఆందోళనకు ఆమె కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు. తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆమె భీష్మించారు. కాగా భర్త ఓంప్రకాష్‌, ఆయన తల్లిదండ్రులు పరారయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement