వాళ్లందరికీ భూమి పిచ్చి పట్టిందయ్యా...! | they are becoming mad about our lands sasy lady farmer | Sakshi
Sakshi News home page

వాళ్లందరికీ భూమి పిచ్చి పట్టిందయ్యా...!

Aug 23 2015 1:12 PM | Updated on Mar 22 2019 5:33 PM

వాళ్లందరికీ భూమి పిచ్చి పట్టిందయ్యా...! - Sakshi

వాళ్లందరికీ భూమి పిచ్చి పట్టిందయ్యా...!

ఓ మహిళా రైతు ఆవేశంగా తమన బాధను వివరించారు. ఇలాంటి ముఖ్యమంత్రిని పుట్టినాక చూడలేదని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. భూమి పిచ్చి పట్టింది. ఈయనకేకాదు కోడెలకి, వెంకయ్యనాయుడు కూడా భూమి పిచ్చి పట్టిందని ధ్వజమెత్తారు.

గుంటూరు: గుంటూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా భూమి సేకరణపై రైతులు మండిపడ్డారు. ముఖ్యంగా మహిళా  రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ధ్వజమెత్తారు.  ఓ మహిళా రైతు ఆవేశంగా తన బాధ వివరించారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. 

'భూమి పిచ్చి పట్టింది. ఈయనకేకాదు కోడెలకి, వెంకయ్యనాయుడు కూడా భూమి పిచ్చి పట్టిందని ధ్వజమెత్తారు. నా ప్రాణం ఇస్తాను కావాలంటే కానీ  భూమినివ్వడానికి ఎట్టి  పరిస్థితుల్లోనూ అంగీకరించను. డబ్బును తయారు  చేస్తాం.. భూమిని ఎలా తయారు చేస్తారు' ఆమె ప్రశ్నించారు.

వరుస ట్వీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై విరుచుకుపడుతున్న హీరో పవన్ కళ్యాణ్ రైతులకు  తన మద్దతు  తెలిపేందుకై గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పెనుమాకలో రైతులను కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement