మక్కాలో సిరిసిల్ల వాసి మృతి | telugu women died in makkah | Sakshi
Sakshi News home page

మక్కాలో సిరిసిల్ల వాసి మృతి

Apr 16 2017 4:32 PM | Updated on Sep 5 2017 8:56 AM

సిరిసిల్ల పట్టణానికి చెందిన మహిళ మక్కా మదీనాలో మృతిచెందింది.

సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణానికి చెందిన మహిళ మక్కా మదీనాలో మృతిచెందింది. స్థానిక పోస్టాఫీసు వద్ద నివసించే అహ్మది బేగం తన స్నేహితురాలితో కలిసి పది రోజుల క్రితం మక్కా మదీనాకు వెళ్లారు. అక్కడ యాత్ర పూర్తి చేసుకుని ఆదివారం సాయంత్రం తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఇంతలోనే ఉదయం ఆమె గుండె పోటుతో మరణించారు. ఈమేరకు ఆమె మృతి సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement