కల్లూరు కస్తూర్బా మండల పరిషత్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న సాయిబాబపై భార్య రామాంజులమ్మ ఆలియాస్ మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 21న కేసు నమోదు చేశారు.
టీచర్‌పై వరకట్న వేధింపుల కేసు
Oct 28 2016 12:58 AM | Updated on May 25 2018 12:54 PM
కర్నూలు : కల్లూరు కస్తూర్బా మండల పరిషత్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న సాయిబాబపై భార్య రామాంజులమ్మ ఆలియాస్ మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 21న కేసు నమోదు చేశారు. బాధితురాలు, పోలీసుల వివరాల మేరకు.. పత్తికొండకు చెందిన అంజనయ్య కూతురు మంజులకు కర్నూలు షరీన్‌నగర్‌లో ఉంటున్న సాయిబాబతో 2000 ఫిబ్రవరి 10న వివాహమైంది. లక్ష రూపాయల నగదు, 8 తులాల బంగారు కట్న కానుకల కింద సమర్పించారు. తర్వాత మరో రూ. లక్ష అదనంగా తీసుకురావాలని వేధిస్తుండడంతో ఆమె 2013 మే 10న ఫిర్యాదు చేయగా పోలీసులు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు పిలిపించి రాజీ కుదిర్చారు. అయినప్పటికీ భర్తలో మార్పు రాలేదని, మరోసారి ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె కొడుకు, కూతురుతో కలిసి ప్రస్తుతం ఆదిత్యనగర్‌లో ఉంటోంది. ఈనెల 10వ తేదీ రాత్రి భర్త, కుటుంబ సభ్యులు వచ్చి గొడవ చేసి బెదిరించారని రామాంజులమ్మ మహిళా పీఎస్ డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం సాయిబాబపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement