పురం అభివృద్ధికి రాజకీయ గ్రహణం | swachabharat ambasidor naresh press meet in hindupur | Sakshi
Sakshi News home page

పురం అభివృద్ధికి రాజకీయ గ్రహణం

Dec 28 2016 10:05 PM | Updated on Aug 13 2018 4:19 PM

పురం అభివృద్ధికి రాజకీయ గ్రహణం - Sakshi

పురం అభివృద్ధికి రాజకీయ గ్రహణం

పట్టణాభివృద్ధిని రాజకీయంగా కొందరు అడ్డుకుంటున్నారని రాష్ట్ర కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు, సినీనటుడు, స్వచ్ఛభారత్‌ జిల్లా అంబాసిడర్‌ నరేష్‌ తెలిపారు.

హిందూపురం అర్బన్‌ : పట్టణాభివృద్ధిని రాజకీయంగా కొందరు అడ్డుకుంటున్నారని రాష్ట్ర కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు, సినీనటుడు, స్వచ్ఛభారత్‌ జిల్లా అంబాసిడర్‌ నరేష్‌ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో  బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వచ్ఛభారత్‌ రాష్ట్ర అంబాసిడర్, ఐటీ శాఖ సలహాదారులు జేఏ చౌదరి ఆధ్వర్యంలో 2015 ఫిబ్రవరిలో స్థానిక బస్టాండును స్వచ్ఛభారత్‌ మోడల్‌గా తీర్చిదిద్దాలని భూమిపూజ చేశామన్నారు.

పార్కుగా మార్చడానికి ఆ ప్రాంతంలోని  డ్రెయినేజీ కుంట సమస్యగా మారిందన్నారు.   ఆర్టీసీ ఆర్‌ఎం, డీఎంలను కలిస్తే మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఏడాదయినా ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. ఇదేంటని అడిగితే రాజకీయ పరిస్థితులు మీకు తెలియవా అంటున్నారన్నారు.   దాతలు నిధులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని, అధికారులు, నాయకులు సహకరిస్తే చాలన్నారు.  సమావేశంలో స్వచ్ఛభారత్‌ కమిటీ పట్టణ చైర్మన్‌ సయ్యద్, కన్వీనర్‌ గోపికృష్ణ, సభ్యులు మున్నా, వెంకటేష్‌ బాబు, వికాస్, సడ్లపల్లి బాబు, పురుషోత్తంరెడ్డి, శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, శ్రీను, హబిబ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement