అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువులో శిల్ప(14) అనే విద్యార్థిని నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదు.
విద్యార్థిని అదృశ్యం
Feb 25 2017 12:36 AM | Updated on Nov 9 2018 5:02 PM
యాడికి: అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువులో శిల్ప(14) అనే విద్యార్థిని నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన శిల్ప రాయలచెరువులోని తన మేనమామ ఇంటిలో ఉంటూ ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 21న పాఠశాలకు వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. అప్పటి నుంచి తెలిసిన చోటల్లా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బాలిక అక్క లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు.
Advertisement
Advertisement