టీడీపీ పాలనలో రాష్ట్రం నాశనం

టీడీపీ పాలనలో రాష్ట్రం నాశనం - Sakshi

– వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి 

 

కర్నూలు (ఓల్డ్‌సిటీ): టీడీపీ పాలనలో రాష్ట్రం నాశనమవుతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమ రాయలసీమ ప్రాంత  పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానిక రాయల్‌ ఫంక‌్షన్‌ హాల్‌లోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో కర్నూలు సమన్వయకర్త హఫీజ్‌ ఖాన్‌ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్య సౌకర్యాలు ప్రజకు అందడం లేదన్నారు. పాము కాటేస్తే ఆసుపత్రుల్లో మందులు లేవని, రోడ్డు ప్రమాద బాధితులు సొంత ఖర్చుతో ఇంజక‌్షన్లు తెచ్చుకుంటున్నారన్నారు. అనంతపురం జిల్లాలో మంచినీటి కోసం 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు.

 

రాష్ట్రపతి ప్రసంగంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడానికి వైఎస్‌ఆర్‌సీపీ ప్రయత్నిస్తే, టీడీపీ నాయకులు నిçస్సుగ్గుగా అడ్డుకున్నారని విమర్శించారు. మహిళా ప్రతినిధి అని కూడా చూడకుండా అసెంబ్లీలో రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేశారన్నారు. ఒకవైపు గిరిజన మహిళలపై దాడులు జరుగుతుంటే.. మరోవైపు పార్లమెంటేరియన్‌ సభలు జరుపుకోవడం ఎందుకని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు.. ఎమ్మెల్సీ ప్రచారానికి ఎంఈవో, హెచ్‌ఎమ్‌లతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్‌సీ ఇస్తానని చెప్పి పది నెలలుగా ఇవ్వలేదన్నారు. పెన్షన్‌ విధానానికి ఒక బృహత్తర ప్రణాలిక రూపొందించానని,  తమ పార్టీ అధినేత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి ప్రకటిస్తానని చెప్పారు. రాష్ట్రంలో 1.43 లక్షల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

 

అన్నివర్గాల సమస్యలు పరిష్కారం..

వెన్నపూస గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ అయితే అన్నివర్గాల ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ ఖాన్‌ అన్నారు. ఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షునిగా ఉద్యోగులకు సంబంధించిన ఎన్నోరకాల సమస్యలు పరిష్కరించారని తెలిపారు. టీడీపీ నాయకులు సాధ్యం కాని హామీలు ఇస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. పరిశ్రమలు మూడేళ్లుగా ఎందుకు స్థాపించలేకపోయారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి అనుభవస్తుడైన అభ్యర్థిని వైఎస్‌ఆర్‌సీపీ తరఫున బరిలో దింపడం  సంతోషకర విషయమని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి అన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు అర్హులందరికీ మంజూరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పార్టీ ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్‌.మద్దయ్య కోరారు. విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు దాదామియ్య, జాన్, హరికృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top