శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది.
శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. జలాశయంలో నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 869 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.8060 టీఎంసీలు ఉండాలి...కానీ ప్రస్తుతం నీటి నిల్వ 136.9330 టీఎంసీలు ఉంది. ప్రాజెక్ట్లో ఇన్ఫో 2, 49,544 ఉండగా... జౌట్ ఫ్లో 75,587 క్యూసెక్కులు ఉంది. అయితే కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది.