కాజీపేట రూరల్ : కృష్ణా పుష్కరాల కోసం కాజీపేట జంక్షన్ మీదుగా నాలుగు ట్రిప్పుల ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టారు. శుక్రవారం ప్రారంభమైన పుష్కరాలు ఈనెల 23 వరకు జరుగుతాయి. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 620 ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా ఇందులో కాజీపేట జంక్షన్ మీదుగా నాలుగు ట్రిప్పులు మాత్రమే ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
సికింద్రాబాద్–విజయవాడ రైలు..
∙07958 నంబర్ గల ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 9,30 గంటలకు బయలుదేరి కాజీపేట జంక్షన్‌కు 11.25 గంటలకు, విజయవాడకు 16.30 చేరుకుంటుంది. ఈ రైలు 14, 21వ తేదీల్లో ఉంటుంది.
l07959 నంబర్ గల రైలు విజయవాడలో 17.30 గంటలకు బయలుదేరి కాజీపేటకు 21.00 గంట లకు, 23.30 గంటలకు సికింద్రాబాద్‌కు వెళ్తుంది. ఈ రైలు కూడా 14, 21 తేదీలలో ఉంటుంది.
చర్లపెల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయన్‌పాడ్ స్టేషన్‌లలో ఈ రైళ్లు ఆగుతాయి.
కాజీపేట జంక్షన్‌లో టైంటేబుల్.. పుష్కరాలకు సంబంధించిన ప్రత్యేక రైళ్ల టైం టేబుల్ పుస్తకాలను కాజీపేట రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్లలో అందుబాటులో ఉంచారు. పుస్తకం ధర రూ.10.
కొత్తగూడెం– విజయవాడ మధ్యలో..
డోర్నకల్ కొత్తగూడెం–విజయవాడ రైలు మార్గంలో పుష్కరాల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఆ సమాచారాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు.
∙07970 నెంబర్ గల రైలు ఈనెల 12 నుంచి 23 వరకు రాయనపాడు–భద్రాచలంరోడ్(కొత్తగూడెం) వరకు నడుస్తుంది. రాయనపాడులో 23.35 గంటలకు బయలుదేరి గంగినేని, ఎర్రుపాలెం, మధిర, బోనకాలు, ఖమ్మం , డోర్నకల్, కారేపల్లి మీదుగా తెల్లవారుజామున 4 గంటలకు కొత్తగూడెం చేరుకుంటుంది.
∙07971 నంబర్ రైలు 12 నుంచి 24 వరకు ప్రతీరోజు 13 ట్రిప్పులు తిరుగుతుంది. కొత్తగూడెం స్టేషన్‌లో తెల్లవారుజామున 5.50 గంటలకు బయలుదేరి కారేపల్లి, డోర్నకల్, ఖమ్మం, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, గంగినేని మీదుగా 9.25 గంటలకు రాయనపాడు చేరుకుంటుంది.
∙07972 నెంబర్ గల రైలు 12 నుంచి 23 వరకు రోజుకు 12 ట్రిప్పులు తిరుగుతుంది. రాయనపాడులో 11 గంటలకు బయలుదేరి గంగినేని, ఎర్రుపాలెం, మధిర, బోనకాలు, ఖమ్మం, డోర్నకల్, కారేపల్లి మీదుగా సాయంత్రం 4 గంటలకు కొత్తగూడెం చేరుకుంటుంది.
∙07973 నెంబర్ గల రైలు కొత్తగూడెంలో సాయంత్రం 4.30కు బయలుదేరి కారేపల్లి, డోర్నకల్, ఖమ్మం, బోనకాలు, మధిర, ఎర్రుపాలెం, గంగినేని మీదుగా రాత్రి 8.30 గంటలకు రాయనపాడు చేరుకుంటుంది.
మణుగూరు–తెనాలి స్పెషల్.. ∙07952 నెంబర్ గల ప్రత్యేక రైలు మణుగూరులో 08.30కు బయలుదేరి కొత్తగూడెం, డోర్నకల్, ఖమ్మం, మధిర, రాయనపాడు, విజయవాడ, కృష్ణాకెనాల్ మీదుగా 13.30 గంటలకు తెనాలి చేరుకుంటుంది.
∙07953 నెంబర్ గల రైలు తెనాలిలో 14.00కు బయలుదేరి కృష్ణా కెనాల్, విజయవాడ, రాయనపాడు, మధిర, ఖమ్మం, డోర్నకల్, కొత్తగూడెం మీదుగా 19.30 గంటలకు మణుగూరు చేరుకుంటుంది.
సికింద్రాబాద్–విజయవాడ స్పెషల్ ∙07755 నెంబర్ రైలు 14, 21 తేదీల్లో సికింద్రాబాద్‌లో 23.55కు బయలుదేరి చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయనపాడు, విజయవాడ మీదుగా 6 గంటలకు కృష్ణా కెనాల్ చేరుకుంటుంది.
07756 నెంబర్ రైలు 15, 22 తేదీల్లో ఉదయం 8 గంటలకు కృష్ణా కెనాల్‌లో బయలుదేరి విజయవాడ, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం, చర్లపల్లి మీదుగా 14.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.రైల్వే సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
ఖాళీగా పుష్కర రైలు..
కొత్తగూడెం నుంచి డోర్నకల్ మీదుగా రాయనపాడుకు వెళ్లిన పుష్కర ప్రత్యే క రైలు శుక్రవారం ప్రయాణికులు లేక బోసిబోయింది. కొత్తగూడెం, డోర్నకల్ ప్రాంతాల నుం చి కృష్ణా పుష్కరాలకు రైళ్లు నడుపుతున్నారనే సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఈ రైలు ఎక్కలేదు. పది బోగీ లకు పైగా ఉన్న డెమో రైలు లోఒక్కోబోగీలో కనీసంఇద్దరు, ముగ్గురు కూడా లేకపోవడం గమనార్హం.