డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. 1, 2, 3 కేటగిరీలకు చెందిన వాగుల్లో సీనరేజి చార్జీలు, ఇతర రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇసుకను ఉచితంగా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. నూతన ఇసుక విధానం ప్రకారం 1,2, 3 కేటగిరీల వాగుల్లోని ఇసుకను స్థానిక సంస్థలు, స్థానికులు గృహ నిర్మాణ అవసరాలకు వినియోగించుకోవచ్చ న్నారు.
వెనుకబడిన తరగతుల వారి స్వంత అవసరాలకు చార్జీలు లేకుండా ఇసుకను ఇవ్వాలని 2015 జనవరిలో విడుదల చేసిన జీవో ఎంఎస్ 3లో పేర్కొన్న విషయాన్నిప్రస్తావించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లను వెనుకబడిన వర్గాల కోసమే నిర్మిస్తున్నందున ప్రభుత్వ ఇసుక పాలసీ నిబంధనల మేరకు జీవోఎంఎస్ 3 వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.