సాహిత్యంలో ‘వ్యాసం’ విశిష్టం | sahithi sankalanam inagriration | Sakshi
Sakshi News home page

సాహిత్యంలో ‘వ్యాసం’ విశిష్టం

Jan 3 2017 10:09 PM | Updated on Sep 5 2017 12:19 AM

సాహిత్యంలో ‘వ్యాసం’ అత్యంత సమర్థంగా నిర్వహించాల్సిన ప్రక్రియని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ పతంజలిశాస్త్రి అన్నారు. వ్యాసరచనను ముఖ్య వ్యాసంగంగా స్వీకరించి కొనసాగిస్తున్న అతి కొద్దిమందిలో డాక్టర్‌ రెంటాల ఒకరని ప్రశంసించారు. కొత్తపేట డిగ్రీ కళాశాల

సాహితీవేత్త డాక్టర్‌ పతంజలి
దివా¯ŒSచెరువు (రాజానగరం) :
సాహిత్యంలో ‘వ్యాసం’ అత్యంత సమర్థంగా నిర్వహించాల్సిన ప్రక్రియని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ పతంజలిశాస్త్రి అన్నారు. వ్యాసరచనను ముఖ్య వ్యాసంగంగా స్వీకరించి కొనసాగిస్తున్న అతి కొద్దిమందిలో డాక్టర్‌ రెంటాల ఒకరని ప్రశంసించారు. కొత్తపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఇటీవల పదవీ విరమణ చేసిన ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్‌ రెంటాల శ్రీవెంకటేశ్వర్రావు రచించిన  ‘ఒలుపు’ సాహితీ వ్యాస సంకలనాన్ని ఆవిష్కరించారు. దివా¯ŒSచెరువులో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్‌ పంతంజలిశాస్త్రి అధ్యక్షత వహించగా వెలమాటి సత్యనారాయణ గ్రంథావిష్కరణ చేశారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ వాడ్రేవు వీరలక్షీ్మదేవి మాట్లాడుతూ పుస్తకానికి ‘ఒలుపు’ అని పేరు పెట్టడంలో ఉన్న ఔచిత్యాన్ని తెలియజేశారు. కవులు బీవీ ప్రసాద్, కాండూరి శ్రీరామచంద్రమూర్తి, మధునాపంతులు సత్యనారాయణమూర్తి, పుష్పరాజ్, ఎ.పేరయ్యనాయుడు, భగ్వాస్‌ కనకయ్య, డాక్టర్‌ జ్యోస్యుల కృష్ణబాబు, అవధానుల మణిబాబు డాక్టర్‌ ధూళిపాళ అన్నపూర్ణ పాల్నొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement