కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలి | rtc workers darna | Sakshi
Sakshi News home page

కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలి

Jul 27 2016 1:16 AM | Updated on Sep 2 2018 4:52 PM

కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలి - Sakshi

కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలి

ఒకటో డిపో మేనేజర్‌ డి.ఢిల్లేశ్వరరావు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని ఆర్టీసీ ఎంప్లాÄæూస్‌ యూనియన్‌ నాయకులు అన్నారు.

– ఆర్టీసీ ఈయూ నాయకుల డిమాండ్‌
 
శ్రీకాకుళం అర్బన్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్‌ డి.ఢిల్లేశ్వరరావు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని ఆర్టీసీ ఎంప్లాÄæూస్‌ యూనియన్‌ నాయకులు అన్నారు. ఎన్‌ఎంయూ నాయకులు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మేరకు ముగ్గురు కార్మికులను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ ఈయూ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో మంగళవారం రెండో రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈయూ నెక్‌ రీజియన్‌ అధ్యక్షుడు బాసూరి కృష్ణమూర్తి, శ్రీకాకుళం డివిజనల్‌ కార్యదర్శి కె.శంకరరావు మాట్లాడుతూ ఆర్టీసీ ఎంప్లాÄæూస్‌ యూనియన్‌ కార్మికులను అన్యాయంగా సస్పెండ్‌ చేశారని, అధికారులు చొరవ తీసుకుని వెంటనే సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో 28, 29వ తేదీల్లో ఈయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే ఈనెల 30వ తేదీన నెక్‌ రీజియన్‌లోని 9 డిపోల కార్మికులతో డీఎం కార్యాలయ ముట్టడి చేస్తామన్నారు. ధర్నాలో శ్రీకాకుళం ఒకటో డిపో అధ్యక్ష, కార్యదర్శులు జి.త్రినాథ్, ఎస్‌వీ రమణ, ఆర్‌జీ రావు, పీపీ రాజు, ఏవీఆర్‌ మూర్తి, కేజీ రావు, టీఆర్‌ బాబు, జీబీ రమణమూర్తి, గ్యారేజీ నాయకులు బి.జయదేవ్, ఎస్‌ఎస్‌ రావు, రెండో డిపో నాయకులు పి.నానాజీ, పి.రమేష్, కె.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement