వారివి సంకుచిత రాజకీయాలు: రఘువీరా | Raghuveera comments on TDP and BJP | Sakshi
Sakshi News home page

వారివి సంకుచిత రాజకీయాలు: రఘువీరా

Nov 1 2016 2:28 AM | Updated on Mar 29 2019 9:31 PM

వారివి సంకుచిత రాజకీయాలు: రఘువీరా - Sakshi

వారివి సంకుచిత రాజకీయాలు: రఘువీరా

టీడీపీ, బీజేపీ పార్టీలు సంకుచిత రాజకీయాలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు.

సాక్షి, అమరావతి: టీడీపీ, బీజేపీ పార్టీలు సంకుచిత రాజకీయాలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నెహ్రూకు, అలాగే గాంధీకి నెహ్రూకు మధ్య విభేదాలున్నాయని సృష్టించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. సోమవారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ 32వ వర్థంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ 130 జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రఘువీరారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, మండలి విపక్షనేత సి.రామచంద్రయ్య, ఏఐసీసీ నేతలు కొప్పుల రాజు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement