వాగ్గొడ్డుగూడెంలో పోడు భూముల వివాదం | Podu land dispute in vaggoddugudem | Sakshi
Sakshi News home page

వాగ్గొడ్డుగూడెంలో పోడు భూముల వివాదం

Jul 11 2016 12:34 PM | Updated on Sep 26 2018 6:01 PM

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం వాగ్గొడ్డుగూడెంలో పోడు భూముల వివాదం రాజుకుంటోంది.

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం వాగ్గొడ్డుగూడెంలో పోడు భూముల వివాదం రాజుకుంటోంది. సోమవారం ఉదయం గిరిజనులు తాము చదువు చేసుకున్న భూముల్లో మొక్కలు నాటేందుకు రాగా అటవీశాఖ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎంత ప్రయత్నించినా గిరిజనులను అడ్డుకోలేకపోయారు. పోలీసులు మోహరించడంతో ఆగ్రహించిన గిరిజనులు పక్కనే ఉన్న అటవీశాఖ భూమిలో ఉన్న నర్సరీ మొక్కలను ధ్వంసంచేశారు. గిరిజనులు మొక్కలు నాటేందుకు ప్రయత్నించిన స్థలం కంటే అధిక విస్తీర్ణంలో నర్సరీ మొక్కలను ధ్వంసంచేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement