మండలకేంద్రమైన చిప్పగిరికి చెందిన షబ్బీర్ (30)..ఆదివారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
May 8 2017 12:11 AM | Updated on Sep 5 2018 2:26 PM
చిప్పగిరి: మండలకేంద్రమైన చిప్పగిరికి చెందిన షబ్బీర్ (30)..ఆదివారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, బంధువుల తెలిపిన వివరాల మేరకు.. ఇతను అనంతపుంర జిల్లా గుంతకల్‌లో కట్టెల మిషన్‌ను ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగించేవాడు. ఆదివారం చిరుజల్లులు పడడంతో మిషన్‌పై నీళ్ల పడకుండా కవర్‌ను కప్పేందుకు వెళ్లాడు. అంతలోనే ఆ మిషన్‌కు విద్యుత్ ప్రవహించడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కుటుంబ యజమానిని కోల్పోవడంతో భార్య, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
Advertisement
Advertisement