భీమడోలు: పోలవరం కుడి కాలువ గట్టు నుం చి ఓ వృద్ధుడు ప్రమాదశాత్తుజారి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆలస్యంగా ఆదివా రం వెలుగులోకి వచ్చింది.
వృద్ధుడి గల్లంతు
Oct 24 2016 2:10 AM | Updated on Apr 3 2019 7:53 PM
భీమడోలు: పోలవరం కుడి కాలువ గట్టు నుం చి ఓ వృద్ధుడు ప్రమాదశాత్తుజారి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆలస్యంగా ఆదివా రం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నా యి.. పోలసానిపల్లి గ్రామానికి చెందిన ఉండి చిన్నయ్య (75) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. శనివారం సాయంత్రం బంధువుల ఇంటికి వెళతానని చె ప్పి ద్వారకాతిరుమలకు బస్సులో బయలుదేరారు. బంధువుల ఇంటికి చేరుకోలేదని తెలి యడంతో కుటుంబసభ్యులు రాత్రి నుంచి చిన్నయ్య కోసం గాలిస్తున్నారు. ఆదివారం ఉదయం పోలసానిపల్లి పంచాయతీ శివారు ఆంజనేయనగరం వద్ద ఉన్న పోలవరం కుడి కాలువ గట్టు వద్ద చిన్నయ్య కర్ర, పాదరక్షలు గుర్తించారు. ప్రమాదవశాత్తు కాలువలో జారి పడి ఉంటాడని భావించి అధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బోటు సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
Advertisement