అనుమానాస్పదస్థితిలో తల్లీకుమారుడు మృతి | mother child unconscious death in karimnagar district | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో తల్లీకుమారుడు మృతి

Feb 7 2016 4:07 PM | Updated on Sep 3 2017 5:08 PM

అనుమానాస్పదస్థితిలో తల్లీకుమారుడు మృతి

అనుమానాస్పదస్థితిలో తల్లీకుమారుడు మృతి

కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పదస్థితిలో తల్లీ కుమారుడు మృతిచెందడంతో స్థానికంగా కలకలం సృష్టించింది.

చొప్పదండి: కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పదస్థితిలో తల్లీకుమారుడు మృతిచెందడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. చొప్పదండి మండలం చాకుంట గ్రామానికి చెందిన నీలర రమేశ్(32)కు, కొలిమిగుంట గ్రామానికి చెందిన అనిత(28)కు రెండు సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి ఏడాది కుమారుడు ఉన్నారు.

శనివారం రాత్రి తల్లి, కుమారుడు ఇంట్లో విషం తాగి చనిపోయి ఉన్నారు. భర్తే, ఇద్దరికీ విషం ఇచ్చి చంపినట్లు అనిత బంధువులు ఆరోపిస్తున్నారు. ఆదివారం ఉదయం రమేశ్ ఇంటి పక్కనున్న బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement