వివాహిత అనుమానాస్పద మృతి | married woman mysterious death | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Jul 2 2016 1:45 PM | Updated on Mar 28 2018 11:26 AM

వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

బంట్వారం: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహారెడ్డికి లక్ష్మీ(30)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. శనివారం ఒంటిమీద గాయాలతో అనుమానాస్పదంగా లక్ష్మి మృతి చెందటంతో.. ఆమె తల్లిదండ్రులు తమ అల్లుడే అదనపు కట్నం కోసం కూతుర్ని కడతేర్చాడని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement