శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి | lord srinivasa sannidhilo hicourt nyayamoorthi | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

Jul 24 2016 6:24 PM | Updated on Sep 4 2017 6:04 AM

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని, తర్వాత వకుళమాతను దర్శించుకున్నారు.

 శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
సాక్షి, తిరుమల: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం  ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని, తర్వాత వకుళమాతను దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు, ప్రొటోకాల్‌ జడ్జి శేషాద్రి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలసి శ్రీకాళహస్తికి చేరుకుని వాయులింగేశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబను దర్శించుకున్నారు. జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement