అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి | life time prisioner dies of unhealth | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి

Mar 28 2017 1:16 AM | Updated on Sep 5 2017 7:14 AM

బుక్కరాయసముద్రం మండల పరి«ధిలోని ఓపెన్‌ ఎయిర్‌ జైలులో ఓ జీవిత ఖైదీ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు.

బుక్కరాయసముద్రం (శింగనమల) : బుక్కరాయసముద్రం మండల పరి«ధిలోని ఓపెన్‌ ఎయిర్‌ జైలులో ఓ జీవిత ఖైదీ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. జైలు అధికారులు తెలిపిన  మేరకు... వైఎస్సార్‌ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం, కస్తూరి రాజుగారిపల్లికి చెందిన రంగయ్య కుమారుడు జయరాం (39)కు ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడింది.

జనవరి–16న కడప జైలు నుంచి ఓపెన్‌ ఎయిర్‌ జైలుకు తీసుకొచ్చారు. అయితే జయరాం కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. నాలుగు రోజుల క్రితం జైలులో అస్వస్థతకు గురికావడంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం చనిపోయినట్లు జైలు అధికారులు తెలిపారు. జయరాంకు ఇంకా పెళ్లి కాలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement