ఆత్మ రక్షణకు షావోలిన్‌ కుంగ్‌ఫూ దోహదం | kungphoo usefull for self protecion | Sakshi
Sakshi News home page

ఆత్మ రక్షణకు షావోలిన్‌ కుంగ్‌ఫూ దోహదం

Feb 12 2017 11:02 PM | Updated on Sep 5 2017 3:33 AM

ఆత్మ రక్షణకు షావోలిన్‌ కుంగ్‌ఫూ దోహదం

ఆత్మ రక్షణకు షావోలిన్‌ కుంగ్‌ఫూ దోహదం

భట్టిప్రోలు: ఆత్మ రక్షణకు షావోలిన్‌ కుంగ్‌ఫూ దోహదపడుతుందని ఎస్‌ఐ ఈ బాలనాగిరెడ్డి చెప్పారు. ఆదివారం భట్టిప్రోలులోని పద్మశాలీయ కల్యాణ మండపం ఆవరణలో షావోలిన్‌ కుంగ్‌ఫూ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో 3వ స్టేట్‌ ఓపెన్‌ కుంగ్‌ఫూ అండ్‌ కరాటే ఛాంపియన్‌ షిప్‌–2017 పోటీలు నిర్వహించారు.

 
 భట్టిప్రోలు:  ఆత్మ రక్షణకు షావోలిన్‌ కుంగ్‌ఫూ దోహదపడుతుందని ఎస్‌ఐ ఈ బాలనాగిరెడ్డి చెప్పారు.  ఆదివారం భట్టిప్రోలులోని పద్మశాలీయ కల్యాణ మండపం ఆవరణలో షావోలిన్‌ కుంగ్‌ఫూ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో 3వ స్టేట్‌ ఓపెన్‌ కుంగ్‌ఫూ అండ్‌ కరాటే ఛాంపియన్‌ షిప్‌–2017 పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ దేహ దారుఢ్యానికి ఆటలు ముఖ్యమని తెలిపారు. ఎపీ చీఫ్‌ ఇన్‌స్ట్రక్టర్, టోర్నమెంట్‌ చీఫ్‌ జడ్జి  వై ప్రభాకర్‌ మాట్లాడుతూ  విద్యార్థులు నేర్చుకున్న ప్రతిభాపాటవాలను నలుగురికీ పంచాలని సూచించారు.  ఆయా ప్రాంతాల నుంచి 200 మంది ఈ పోటీలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో  చీఫ్‌ ఇన్‌స్ట్రక్టర్‌  కె.గోపి, ఏపీ అడ్వైజర్‌ పి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. స్పైరింగ్, వెపన్‌ డిమానిస్ట్రేషన్, టీమ్, సింగిల్‌ విభాగాలలో పోటీలు నిర్వహించారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement