కృష్ణగిరి రిజర్వాయర్ వద్ద మాట్లాడుతున్న చెరుకులపాడు నారాయణరెడ్డి
చెరువులకు, కాలువలకు నీరుస్తున్నామంటూ ప్రకటనలు చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకులపాడునారాయణరెడ్డి ధ్వజమెత్తారు.
–చెరుకులపాడులో 600 ఎకరాలకు
నీరిచ్చామన్నాది అబద్దం
- మాటలు కట్టిపెట్టి రైతులను
ఆదుకోవాలి
- వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ ఇన్‌చార్జ్
చెరుకులపాడు నారాయణరెడ్డి
వెల్దుర్తి రూరల్: చెరువులకు, కాలువలకు నీరుస్తున్నామంటూ ప్రకటనలు చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకులపాడునారాయణరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన కృష్ణగిరి రిజర్వాయర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్‌లో నీరున్నా కాలువకు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. వేసిన పంటలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెడుతున్నా పాలకులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. చెరుకులపాడు జన్మభూమి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం తనయుడు శ్యాంబాబు చెరుకులపాడు, కొసనాపల్లె గ్రామాల్లో 600ఎకరాలకు హంద్రీనీవా ద్వారా నీరందించమనడం హాస్యాస్పదమన్నారు. పిల్లకాలువలు ఏర్పాటు చేయకుండానే పొలాలకు నీరిచ్చామనడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కూర్మగిరి, కంబాలపాడు, పెనుమాడ మినహా ఏ చెరువులకు నీరు నింపారో చెపా్పలని డిమాండ్ చేశారు.
కేఈ కుటుంబం నియోజకవర్గంలో ఇసుక దోపిడీలకు తెగబడుతుందని ఆరోపించారు, దీంతో హంద్రీ సమీప ప్రాంతాల్లో భూగర్భజ లాలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవిషయాన్ని రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా రైతుల గోడు పట్టించుకోవాలని, చెరువులు నింపి, పిల్లకాలువల ద్వారా పంటలకు నీరివ్వాలని, హంద్రీ వెంట ఇసుకదందా ఆపించాలని కోరారు. ఆయన వెంట చెరుకులపాడు మాజీ ఎంపీటీసీ మల్లయ్య, మాజీ సర్పంచ్ సోమయ్య, రైతులు ఉన్నారు.