'ర్యాగింగ్ నియంత్రణ ఉత్తర్వులు విడుదల' | for abolition of ragging go issued by ap govt | Sakshi
Sakshi News home page

'ర్యాగింగ్ నియంత్రణ ఉత్తర్వులు విడుదల'

Aug 14 2015 5:31 PM | Updated on Aug 25 2018 4:51 PM

విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రిషితేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో ప్రభుత్వం అంతకుముందే ఈ ఉత్తర్వులపై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల ప్రకారం అన్ని విశ్వవిద్యాలయాల్లో సీసీ కెమెరాలను పెట్టాలని ఆదేశించింది. ఇక హాజరు శాతం ఆధారంగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందని తెలిపింది.

యూనివర్సిటీల్లో బయటి వ్యక్తులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అది కూడా ఈ నెల 31లోపే తీసుకోవాలని ఆదేశించింది. త్వరలోనే ర్యాగింగ్ చట్టంలో మార్పులు తీసుకురానున్నట్లు తెలిపింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరీ అనే పీజీ విద్యార్థిని ర్యాగింగ్ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement