రెండు కార్ఖానాలు దగ్ధం | fire accident in someswaram | Sakshi
Sakshi News home page

రెండు కార్ఖానాలు దగ్ధం

Jan 15 2017 11:52 PM | Updated on Sep 5 2018 9:47 PM

గ్రామంలో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు కార్ఖానాలు అగ్నికి ఆహుతయ్యాయి. మండపేట–కాకినాడ రహదారి సమీపంలో ఎస్‌ఆర్‌ రోడ్డును ఆ నుకుని సబ్బెళ్ల శ్రీని వాసరెడ్డికి చెందిన షెడ్డులో ఎం.సత్యప్రసాద్, జి.చిట్టిబాబు వేర్వేరుగా పక్క పక్కన

  • రూ.15 లక్షల ఆస్తినష్టం
  • సోమేశ్వరం (రాయవరం) (మండపేట) : 
    గ్రామంలో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు కార్ఖానాలు అగ్నికి ఆహుతయ్యాయి. మండపేట–కాకినాడ రహదారి సమీపంలో ఎస్‌ఆర్‌ రోడ్డును ఆ నుకుని సబ్బెళ్ల శ్రీని వాసరెడ్డికి చెందిన షెడ్డులో ఎం.సత్యప్రసాద్, జి.చిట్టిబాబు వేర్వేరుగా పక్క పక్కన కార్ఖానాలు నడుపుతున్నారు. శనివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  సత్యప్రసాద్‌కు చెందిన కార్ఖానాలో రూ.5 లక్షల విలువైన కలప, చిట్టిబాబుకు చెందిన కార్ఖానాలో రూ.8 లక్షల కలప దగ్ధమైంది. సామగ్రి చేయమని పలువురు ఇచ్చిన టేకి, ఏగిస, బండారు, వేప తదితర రకాల కలప ప్రమాదంలో కాలిబూడిదైందని వారు వాపోయారు. వీటిలో మూడు పెద్దవి చిత్రీ మెషీన్లు, 20 వరకూ హేండ్‌మిషన్లు, బాడితి, ఉలులు తదితర పనిముట్లు ఆహుతయ్యాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగిఉంటుందని భావిస్తున్నారు. ప్రమాద విషయాన్ని స్థానికులు గుర్తించి యజమానులకు సమాచారం ఇచ్చేసరికే కార్ఖానాలు పూర్తిగా కాలిపోయాయి. రెండు కార్ఖానాల్లో సుమారుగా రూ.15 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్టు నిర్వాహకులు వాపోయారు. సామగ్రి చేయమని కలప ఇచ్చిన వారికి వారికి ఏం చెప్పాలో తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రపురం అగ్నిమాపక సిబ్బంది  మంటలను అదుపు చేశారు. 
     

Advertisement
 
Advertisement
Advertisement