ఎంపీపీ భూమి లాక్కుండు.. ఇక చావే గతి | farmer suicide attempt at kadapa collectorate | Sakshi
Sakshi News home page

ఎంపీపీ భూమి లాక్కుండు.. ఇక చావే గతి

Oct 31 2016 2:26 PM | Updated on Oct 1 2018 2:44 PM

ఎంపీపీ భూమి లాక్కుండు.. ఇక చావే గతి - Sakshi

ఎంపీపీ భూమి లాక్కుండు.. ఇక చావే గతి

కడప కలెక్టరేట్లో సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశారు.

కడప: కడప కలెక్టరేట్లో సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. చంద్రారెడ్డి అనే రైతు పురుగుల మందు డబ్బాతో చెట్టెక్కడంతో కలెక్టరేట్లో కలకలం రేగింది. టీడీపీకి చెందిన సీకే దిన్నె ఎంపీపీ వెంకటసుబ్బారెడ్డి రాత్రికి రాత్రి తన స్థలాన్ని ఆక్రమించారని సదరు రైతు ఆరోపించారు.

ఈ విషయంపై తహశీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు న్యాయం చేస్తామని నచ్చచెప్పి చంద్రారెడ్డిని కిందికి దించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement