ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి
పొలం పనులు చేయడానికి వచ్చిన కూలీలకు తాగునీటిని తెచ్చేందుకు సమీప బావిలోకి దిగిన ఓ రైతు ప్రమాద వశాత్తు నీటిలో పడి మరణించాడు.
మంత్రాయలం రూరల్ : పొలం పనులు చేయడానికి వచ్చిన కూలీలకు తాగునీటిని తెచ్చేందుకు సమీప బావిలోకి దిగిన ఓ రైతు ప్రమాద వశాత్తు నీటిలో పడి మరణించాడు. ఈ ఘటన మంత్రాలయం మండలం వగరూరులో ఆదివారం చోటు చేసుకుంది. మంత్రాలయం ఎస్‌ఐ శ్రీనివాసనాయక్ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అబ్దుల్ సాహెబ్ కుమారుడు ఆలీబాషా(25) ఆదివారం పొలం పనులు చేయించేందుకు కూలీలను పిలుచుకెళ్లాడు. సాయంత్రం కూలీలకు తాగునీరు తెచ్చేందుకు బావికి వెళ్లిన ఈయన నీటిని ముంచుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో ఊపిరి ఆడక మరణించాడు. బాషా ఎంతకూ రాకపోవడంతో కూలీలు బావి వద్దకు చేరుకుని పరిస్థితిని గ్రహించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఆశ, ఇద్దరు కూతుళ్లు, కూమారుడున్నారు.