ఒంగోలు టూటౌన్: ఒంగోలు డెయిరీ పాలకు రాజధానితో పాటు ఐదు జిల్లాల్లో మంచి ఆదరణ లభిస్తోంది.
-
తొలిరోజే ఎనిమిది వేల లీటర్ల పాలు అమ్మకం
-
డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు
ఒంగోలు టూటౌన్: ఒంగోలు డెయిరీ పాలకు రాజధానితో పాటు ఐదు జిల్లాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. డెయిరీ ఆదాయం పెంపుదించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఖమ్మంలోనూ ఒంగోలు డెయిరీ పాల అమ్మకాలు చేపట్టినట్లు డెయిరీ చైర్మన్‌చల్లా శ్రీనివాసరావు తెలిపారు.
గురువారం విజయవాడలో ప్రధాన కేంద్రం ప్రారంభించినట్లు చెప్పారు. తొలిరోజే ఎనిమిది వేల లీటర్ల వరకు పాలు అమ్మకం జరిగినట్లు తెలిపారు. పాలతోపాటు జున్ను, వెన్న, నెయ్యి, దూద్‌పేడ వంటి పదార్థాలను కూడా అమ్ముతున్నామన్నారు. ఇంకా పాల అమ్మకాలను పెంచేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఒంగోలు డెయిరీకి పాల తగ్గకుండా రోజువారీ సమీక్షలతో చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఒంగోలు డెయిరీ ఎండీ శివరామయ్య, జనరల్ మేనేజర్, పాలక వర్గ సభ్యులు, టెక్నికల్ టీమ్ అధికారులు ఉన్నారు.