ఉద్యోగుల బదిలీలకు తెర.... నిషేధం అములులోకి | employees transfers completed | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల బదిలీలకు తెర.... నిషేధం అములులోకి

May 26 2017 12:46 AM | Updated on Mar 19 2019 7:01 PM

కాకినాడ సిటీ: జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు బుధవారం రాత్రితో తెరపడింది. దీంతో గురువారం నుంచి బదిలీలపై నిషేధం అమలులోకి వచ్చింది. ఒకే చోట మైదాన ప్రాంతంలో ఐదు సంవత్సరాలు, ఏజెన్సీలో రెండు సంవత్సరాలు ఒకేచోట

- గడువు ముగిసినా రెవెన్యూలో కొనసాగిన బదిలీల కసరత్తు
కాకినాడ సిటీ: జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు బుధవారం రాత్రితో తెరపడింది. దీంతో గురువారం నుంచి బదిలీలపై నిషేధం అమలులోకి వచ్చింది. ఒకే చోట మైదాన ప్రాంతంలో ఐదు సంవత్సరాలు, ఏజెన్సీలో రెండు సంవత్సరాలు ఒకేచోట పనిచేసిన ఉద్యోగులను బదిలీ చేయాలని సూచిస్తూ ప్రభుత్వం నెల రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం జిల్లా పరిషత్, పంచాయతీ, గృహ నిర్మాణం, గ్రామీణ నీటిపారుదల తదితర అన్ని శాఖల్లో ఉద్యోగుల బదిలీలను గడువులోపు పూర్తి చేశారు. అయితే వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలకు మాత్రం ప్రత్యేకంగా గడువు ఇవ్వడంతో వారి బదిలీ జరగాల్సి ఉంది. ప్రధానమైన రెవెన్యూ శాఖలో వీఆర్‌వో నుంచి తహసీల్దార్‌ కేడర్‌ వరకు బదిలీలకు గడువు ముగిసిన 24 గంటల వరకు కసరత్తు జరగడం విశేషం. ఈ శాఖలో ప్రతి సంవత్సరం గడువు రోజు అర్ధరాత్రి వరకు బదిలీల ప్రక్రియ ఒక కొలిక్కి రాకపోవడం తరువాత రోజు ముందు తేదీలతో ఉత్తర్వులు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. ఈ సంవత్సరం ఆ రీతిలోనే కొనసాగింది.  రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి తహసీల్దార్‌ కేడర్‌ వరకు బదిలీల జాబితాను గురువారం రాత్రి  కలెక్టరేట్‌ అధికారులు విడుదల చేశారు. తహసీల్దార్లతోపాటు పది మంది డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు పది మంది, జూనియర్‌ అసిస్టెంట్లు 9 మంది, వీఆర్‌వోలు 72 మందిని బదిలీ చేశారు.
11మంది తహసీల్దార్లకు బదిలీ పోస్టింగులు...
జిల్లాలో వివిధ మండలాల్లో పనిచేస్తున్న 8 మంది తహసీల్దార్లను బదిలీ చేయగా కృష్ణా, అమరావతి నుంచి వచ్చిన ముగ్గురికి పోస్టింగులు ఇచ్చారు. రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఏవో కేవీవీ సత్యనారాయణ కలెక్టరేట్‌ సీ–సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా, ఎటపాక ఆర్డీవో కార్యాలయ ఏవో పినిపే సత్యనారాయణ అమలాపురం ఆర్డీవో కార్యాలయ కేఆర్‌సీ తహసీల్దార్‌గానూ, మారేడుమిల్లి తహసీల్దార్‌ ఎండీ.యార్‌ఖాన్‌ ఏలేశ్వరం తహసీల్దార్, ఆలమూరు తహసీల్దార్‌ టి.రాజేశ్వరరావు రాజమహేంద్రవరం అర్బన్‌ తహసీల్దార్‌గా, రాజమహేంద్రవరం అర్బన్‌ తహసీల్దార్‌ కె.పోసియ్య రాజమహేంద్రవరం రూరల్‌ తహసీల్దార్‌గానూ, కలెక్టరేట్‌ బి–సెక్షన్‌ సూపరింటెండెంట్‌ ఎం.రవీంద్రకుమార్‌ కూనవరం తహసీల్దార్‌గా, రాజమహేంద్రవరం రూరల్‌ తహసీల్దార్‌ జి. భీమారావు కలెక్టరేట్‌ ఏవోగానూ, కలెక్టరేట్‌ ఏవో పి.తేజేశ్వరరావు చింతూరు తహసీల్దార్‌గా బదిలీ అయ్యారు. జిల్లా బయట నుంచి వచ్చిన వారిలో అమరావతి సీఆర్‌డిఏ తహసీల్దార్‌ ఎం.కృష్ణమూర్తికి రంగంపేట తహసీల్దార్‌గానూ, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయం ఏవో డీఎస్‌.శర్మను రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఏవోగానూ, కృష్ణా జిల్లా నుంచి పదోన్నతిపై వచ్చిన డిప్యూటీ తహసీల్దార్‌ సీహెచ్‌.రామలక్ష్మిని కలెక్టరేట్‌ ల్యాడ్‌రిఫామ్స్‌ ఏవోగా పోస్టింగులు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement