మండలంలోని ఒత్కులపల్లి గ్రామంలో కొత్తగూడెం కాలనీకి వెళ్లే దారిలో ఒర్రె ఉండటంతో వెళ్లేందుకు ప్రజలు గతంలో ఇబ్బందులు పడేవారు.
వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డు
Jul 25 2016 12:03 AM | Updated on Aug 30 2018 4:07 PM
చెన్నూర్ రూరల్ : మండలంలోని ఒత్కులపల్లి గ్రామంలో కొత్తగూడెం కాలనీకి వెళ్లే దారిలో ఒర్రె ఉండటంతో వెళ్లేందుకు ప్రజలు గతంలో ఇబ్బందులు పడేవారు. వేసవి కాలంలో కాలనీకి వెళ్లేందుకు పైప్‌లైన్లు అమర్చి వాటి నుంచి మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో కాలనీకి వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకొని కాలనీకి వెళ్లేందుకు సౌకర్యం కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Advertisement
Advertisement