దాడి ఘటనలో ఐదుగురిపై కేసు | case filed against attack | Sakshi
Sakshi News home page

దాడి ఘటనలో ఐదుగురిపై కేసు

Jul 20 2016 9:15 PM | Updated on Apr 4 2019 5:24 PM

పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంటిపై దాడి చేసిన ఐదుగురిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

సిద్దిపేట క్రైం : పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంటిపై దాడి చేసిన ఐదుగురిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వన్‌టౌన్‌ పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని భారత్‌నగర్‌కు చెందిన నరేష్‌ మంగళవారం ఇంట్లో ఉన్నాడు. ఈ క్రమంలో కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కంపేట గ్రామానికి చెందిన నాగరాజుతో పాటు పవన్‌కుమార్, బన్నీ మరో ఇద్దరు నరేష్‌ ఇంట్లోకి ప్రవేశించారు. నరేష్‌పై దాడి చేసి ఇంటి తలుపులు ధ్వంసం చేశారు. బాధితుడు నరేష్‌ ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement