ఎందుకీ కక్ష, మేం ఏం తప్పు చేశాం: ఉండవల్లి | BJP governments cheated AP people, says undavalli arunkumar | Sakshi
Sakshi News home page

ఎందుకీ కక్ష, మేం ఏం తప్పు చేశాం: ఉండవల్లి

Jul 30 2016 11:26 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఎందుకీ కక్ష, మేం ఏం తప్పు చేశాం: ఉండవల్లి - Sakshi

ఎందుకీ కక్ష, మేం ఏం తప్పు చేశాం: ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీజేపీ మోసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీజేపీ మోసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి రాయితీలు వస్తాయని అందుకే  ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతున్నామన్ని ఆయన శనివారమిక్కడ అన్నారు. హోదా ఎందుకు అమలు చేయడం లేదో కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం లేదో సమాధానం ఇవ్వాలన్నారు.

ఏపీ ప్రజలపై ఎందుకింత కక్ష అని, ఏ తప్పు చేశామని ఉండవల్లి ఈ సందర్భంగా నిలదీశారు. కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు నిలదీయడం లేదన్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ ఆపేందుకు కుట్ర జరుగుతోందని ఉండవల్లి ఆరోపించారు.  పోలవరం  పూర్తయితే 2వేల టీఎంసీల నీటిని వాడుకోవచ్చని,  అవసరం అయితే ఒడిశాకు నీళ్లు అందించవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement