ఈనెల 23న ఏవోబీలో పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్ బూటకపు ఎన్‌కౌంటర్ అని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) జిల్లా సహాయ కార్యదర్శి చీమల వసంతరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టులు చనిపోయారు తప్ప పోలీసులకు ఏ విధమైన నష్టం జరగలేదన్నారు.
ఏవోబీ ఎన్‌కౌంటర్ బూటకం
Oct 29 2016 7:23 PM | Updated on Mar 28 2019 5:07 PM
	బుట్టాయగూడెం: ఈనెల 23న ఏవోబీలో పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్ బూటకపు ఎన్‌కౌంటర్ అని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) జిల్లా సహాయ కార్యదర్శి చీమల వసంతరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టులు చనిపోయారు తప్ప పోలీసులకు ఏ విధమైన నష్టం జరగలేదన్నారు. అటు వైపు నుంచి మావోయిస్టులు కూడా కాల్పులు జరిపి ఉంటే పోలీసుల వైపు కూడా నష్టం జరగాలి కదా? అని ప్రశ్నించారు. ప్రజలను నమ్మించేందుకే పోలీసులు ఎన్‌కౌంటర్ అని చెబుతున్నారన్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారిని విడిచిపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు ఎం.రామన్న, టి.ప్రకాష్, ఏఐకేఎమ్‌ఎస్ నాయకులు టి.రామిరెడ్డి, ఎం.కష్ణ తదితరులు ఆయన వెంట ఉన్నారు.  
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
