ఆంథోల్ మైసమ్మ.. మహిమ గల దేవత
భక్తుల కోరికలు తీర్చే మహిమ గల దేవత ఆంథోల్‌మైసమ్మ తల్లి అని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలు అన్నారు.
చౌటుప్పల్ : భక్తుల కోరికలు తీర్చే మహిమ గల దేవత ఆంథోల్‌మైసమ్మ తల్లి అని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలు అన్నారు. మండలంలోని మల్కాపురం శివారులోని ఆంథోల్‌మైసమ్మ దేవాలయంలో శనివారం 11వ బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. దేవాలయ అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శేష వస్త్రాలతో సత్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం నూతనంగా నిర్మించిన డార్మెటరీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంథోల్‌మైసమ్మ దేవాలయం జిల్లాకే తలమానికంగా మారిందన్నారు. జిల్లాలోనే మొట్టమొదటగా ఆంథోల్ మైసమ్మ దేవాలయ బోనాల పండుగను నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు వేలాది తరలిరావాలని కోరారు. ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు ఆంథోల్‌మైసమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలన్నారు. దేవాలయ ఈఓ చిట్టెడి వెంకట్‌రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యేలకు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్.రామచంద్రారావు, ఇన్‌స్పెక్టర్ ఎం.వెంకటలక్ష్మీ, సర్పంచ్ సోమ అరుణ, ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, ఈడ్దుల హరిప్రసాద్, దాసు, మస్తాన్‌బాబు, జింకల కృష్ణ, అయిలయ్య, శ్రీధర్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.