1639 కేసుల పరిష్కారం | Sakshi
Sakshi News home page

1639 కేసుల పరిష్కారం

Published Sat, Sep 10 2016 10:30 PM

1639 కేసుల పరిష్కారం

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని
  • ఒంగోలు సెంట్రల్‌ :
    లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే ఇరువురికీ గెలుపు సాధ్యమవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ ఎం.జి.ప్రియదర్శిని అన్నారు. ఒంగోలు జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొని మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ల ద్వారా కేసులు పరిష్కరించుకుంటే సమయం, ధనం ఆదా అవుతుందన్నారు.
     
    కార్యక్రమానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.రాజా వెంకట్రాద్రి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మెుదటి అదనపు జిల్లా జడ్జి ఎస్‌కె.మహ్మద్‌ ఇస్మాయిల్, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.శివనాగేశ్వరరావు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.లక్ష్మీకుమారి, మూడో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి జె.శ్రావణ్‌కుమార్, పి.వి.శిరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 1639 కేసులను జాతీయ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించారు. వీటిలో 34 సివిల్‌ కేసులు, 1113 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా ఒంగోలు, అద్దంకి కోర్టుల పరిధిలో కేసులను పరిష్కరించారు.  
     
    ఒంగోలు జిల్లా కోర్టులో ఐదు బెంచ్‌లు ఏర్పాటు:
    మెుదటి బెంచ్‌కు ప్రిసైడింగ్‌ అధికారిగా మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్‌కె.మహ్మద్‌ ఇస్మాయల్, రెండో బెంచ్‌కు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.లక్ష్మీ కుమారి, మూడో బెంచ్‌కు డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.రాజా వెంకటాద్రి, నాల్గవ బెంచ్‌కు ఎక్సైజ్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ ఎస్‌కె ఇబ్రహీం షరీఫ్,  ఐదో బెంచ్‌కు మూడో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి జె శ్రావణ్‌ కుమార్‌ ప్రిసైడింగ్‌ అధికారులుగా వ్యవహరించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement