
కాన్‌బెర్రాలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు
ఆస్ట్రేలియాలో కాన్బెర్రా తెలంగాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి.
కాన్‌బెర్రా :
ఆస్ట్రేలియాలో కాన్బెర్రా తెలంగాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇండియన్ హై కమీషనర్ డాక్టర్ ఏ.ఎం.గోర్డానే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణా అభివృద్ధి, హైదరాబాద్ భాష, యాస గురించి గోర్డానే ప్రస్తావించారు. ఆస్ట్రేలియన్ కాపిటల్ టెర్రిటరీ లిబరల్ నాయకులు అల్సటైర్ కో కొత్త రాష్ట్రము తెలంగాణ గురించి ఉపన్యసించారు. స్థానిక మల్టీ కల్చరల్ మినిస్టర్ తరపున ఎం.ఎల్. ఏ. సుజానే ఒర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమవుతుందనడానికి తెలంగాణ ఒక మంచి ఉదాహారణ అని ప్రెసిడెంట్ శాంతి రెడ్డి అన్నారు.
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ పూజిత కృష్ణ జ్యోతి తన నృత్య ప్రదర్శనతో అలరించారు. కూచిపూడి నృత్యం పుట్టు పుర్వోతరాల గురించి వివరించారు. పిల్లలు, పెద్దలు తమ ఆట పాటలతో అతిథులను ఉర్రూతలూగించారు. చలిని కూడా లెక్క చేయకుండా నగర వాసులు పెద్ద మొత్తంలో హాజరై సభను విజయవంతం చేశారు. కాన్‌బెర్రా తెలంగాణ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శాంతి రెడ్డి, రమేష్ కైలా, సతీష్ గాదె, స్వయం ప్రకాష్ చింతామణి , వెంకట్ లింగా రెడ్డి, రాజి రెడ్డి కోతి, ప్రవీణ్ కొంకి, శేఖర్ సారంగి, స్వప్న తాండ్ర, రజితా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాశం, చంద్ర శేఖర్ బల్చురీ, శ్రీనివాస్ దేవరశెట్టి, సంజయ్ కల్వకుంట్ల, సిద్దు గొర్ల, నరేష్ టేకులపల్లి, అశ్విన్ రెడ్డి గుర్రాల, మట్టా రెడ్డిలు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తమవంతు కృషి చేశారు.