తారను చంపింది స్నేహితుడే | Woman's Murder Mystery Revealed | Sakshi
Sakshi News home page

బాకీ చెల్లించాలన్నందుకే హత్య

Jan 4 2018 8:36 AM | Updated on Aug 13 2018 8:03 PM

Woman's Murder Mystery Revealed - Sakshi

బనశంకరి: బెంగళూరు కమర్షియల్‌ స్ట్రీట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సంగమ్‌ రోడ్డులోని ఓ ఇంటిలో కుళ్లిపోయిన స్థితిలో లభించిన మహిళ మృతదేహానికి సంబంధించిన కేసు మిస్టరీ వీడింది. బాకీ చెల్లించాలని కోరినందుకు స్నేహితుడే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. మృతురాలు తార అనే మహిళగా నిర్ధారించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. హెచ్‌ఏఎల్‌లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న గోపీనాథ్‌.. తార కుటుంబానికి ఆత్మీయస్నేహితుడు.

ఇటీవల గోపినాథ్‌.. ఆమె  వద్ద రూ.11 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.  డబ్బు చెల్లించాలని తార కోరుతున్నా గోపినాథ్‌ పట్టించుకునేవాడు కాదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమెపై కక్ష పెంచుకున్న గోపినాథ్‌.. తారను  చాకుతో పొడిచి దిండుతో గొంతునులిమి హత్యచేసి ఇంటికి తాళం వేశాడు. పోలీసులు గోపినాథను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా హత్య చేసినట్లు అంగీకరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement