రక్షా బంధన్‌ రోజున పుట్టింటికి పంపలేదని.. | Woman Commits Suicide In UP | Sakshi
Sakshi News home page

రక్షా బంధన్‌ రోజున పుట్టింటికి పంపలేదని..

Aug 16 2019 8:50 PM | Updated on Aug 16 2019 8:59 PM

Woman Commits Suicide In UP - Sakshi

లక్నో : రక్షా బంధన్‌ రోజున పుట్టింటికి పంపలేదని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కోత్వాలిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సీతాపూర్‌ జిల్లా కోత్వాలికి చెందిన అనామిక అనే మహిళ రక్షా బంధన్‌ రోజున పుట్టింటికి వెళతానని భర్త అన్సూల్‌ సింగ్‌ను అడిగింది. అయితే అతడు ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన అనామిక.. భర్త బయటకు వెళ్లిపోయిన తర్వాత ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫ్యాన్‌కు వేళాడుతుండటం గమనించిన కొడుకు అహమ్‌ ఇంటి బయటకు పరిగెత్తి ఏడవటం మొదలుపెట్టాడు. ఇది గమనించిన పొరిగిళ్లవారు అక్కడికి వచ్చి ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనామిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా అన్సూల్‌ సింగ్‌పై అనామిక కుటుంబసభ్యులు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement