బాల్క సుమన్‌ కేసులో మరో ఇద్దరి అరెస్ట్‌ 

Two Accuse Arrested In MP Balka Suman Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ ‌: పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా భీభత్సం సృష్టించిన ఘటనలో మరో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లోని నందినగర్‌ ఉంటున్న  బాల్క సుమన్‌ ప్లాట్‌లోకి గత నెల మంచిర్యాలకు చెందిన శంకర్, విజేత, గోపాల్, సంధ్య, అక్రమంగా ప్రవేశించి ఆయన వ్యక్తిగత సహాకుడు సునీల్‌పై దాడికి యత్నించారు.

ఎంపీని దూషించడంతో సునీల్‌ గతనెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం శంకర్, విజేతలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న గోపాల్, సంధ్యలను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత కథనాలు: 

బాల్క సుమన్‌ భార్య ఫొటో మార్ఫింగ్‌

ఎంపీ సుమన్‌పై వైరల్ కథనాలు: పోలీసుల స్పందన

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top