ఎంపీ బాల్క సుమన్‌పై ఆరోపణలు.. స్పష్టత

TRS MP Balka Suman Sexual Harassment Totally  Fake - Sakshi

పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కొన్ని మీడియా సంస్థలో హల్‌ చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు మహిళలపై ఎంపీ లైంగిక దోపిడీకి పాల్పడ్డారంటూ ప్రధానికి పాత్రికేయుల లేఖ రాశారంటూ ఓ కథనం చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించారు. 

సాక్షి, మంచిర్యాల: టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మంచిర్యాల సీఐ మహేష్‌ శుక్రవారం ఉదయం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ‘ఎంపీ బాల్క సుమన్‌పై వైరల్‌ అవుతున్న లైంగిక వేధింపుల ఘటన అవాస్తవం. బాధితులుగా చెప్పుకుంటున్న బోయిని సంధ్య, విజేతలు గతంలోనూ పలువురిని బ్లాక్‌మెయిల్‌ చేసి వేధించినట్లు మా విచారణలో వెల్లడైంది. ఎంపీపై ఆరోపణలకుగానూ వారిద్దరిపై ఫిబ్రవరి 6న కేసు నమోదు చేశాం. ఇప్పుడు బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లోనూ వారిపై కేసులు నమోదు అయ్యాయి. ఎంపీని ట్రాప్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ ద్వారా డబ్బు గుంజాలని యత్నించారు. అందులో భాగంగానే ఎంపీ కుటుంబ సభ్యుల ఫోటోను నిందితులు మార్ఫింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో సర్క్యూలేట్‌ చేశారు’ అని సీఐ మహేష్‌ వెల్లడించారు. సంధ్య, విజేతలపై ఐపీసీ 420 , 292ఏ  , 419 , 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top