
మృతురాలు మమత
తూప్రాన్: ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్న ఆ తల్లి, మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే భయంతో మనస్తాపంతో బలవర్మణానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్ పంచా యతీ పరిధిలోని పాత బాపన్‌పల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగార్జునగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన కర్రె శ్రీశైలం యాదవ్, మమత దంపతులకు గతంలో ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు.
ప్రస్తుతం ఆమె గర్భం దాల్చింది. తిరిగి ఆడపిల్లే జన్మిస్తుందన్న అనుమానంతో మనస్తాపం చెందిన మమత(25)ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.