సుబ్బారాయుడి హత్య మిస్టరీ వీడింది!

Police Revealed Subbarayudu Murder Case In Kurnool District - Sakshi

ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం హత్య చేసిన టీడీపీ నేత

సాక్షి,కర్నూలు: జిల్లాలోని మెట్టుపల్లి గ్రామంలో 2015, డిసెంబర్‌ 5న జరిగిన సుబ్బారాయుడు దారుణ హత్య కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. ఈ కేసులోని నలుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను ఈ సందర్భంగా పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం తన వద్ద పనిచేస్తున్న సుబ్బారాయుడు అనే పనివాడిని.. అవుకు మండల టీడీపీ నాయకుడు సీ జే భాస్కర్ రెడ్డి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు.  సినీ ఫిక్కీలో పథకం ప్రకారం ఇన్సూరెన్స్ డబ్బును కాజేయడానికి ఈ హత్య చేశారని, మృతి చెందిన సుబ్బారాయుడిపై  నిందితుడు అప్పటికే రెండు ఇన్సూరెన్స్‌ పాలసీలను చేశాడని, ఆ ఇన్సూరెన్స్‌ డబ్బును క్లెయిమ్‌ చేసుకోవడానికిగాను సుబ్బారాయుడిని దారుణంగా హతమార్చి యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని పోలీసులు వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top