సాక్షి, చెన్నై : తమిళనాడులో ఆదివారం వెర్వేరు ప్రాంతాల్లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో 9మంది మృతిచెందగా, 14 మందికి తీవ్రంగా గాయపడ్డారు. తంజావూరు జిల్లాలో లారీ- కారు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరొక ఘటన రామేశ్వరంలో జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న వ్యాను- లారీని ఢీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే నలుగురు మృతి చెందారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోనే ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.