ప్రియురాలి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. | Man Kills Lover In Thiruvottiyur | Sakshi
Sakshi News home page

ప్రియురాలి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి..

Nov 30 2018 8:10 AM | Updated on Nov 30 2018 8:10 AM

Man Kills Lover In Thiruvottiyur - Sakshi

మృతి చెందిన లిల్లీబాయి (ఫైల్‌)

ప్రియుడికి లిల్లీబాయి కోరినప్పుడల్లా నగలు, నగదు ఇచ్చారు. కొన్నాళ్ల తరువాత ఆమె ఇచ్చిన నగలు, నగదు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేసింది. దీంతో...

తిరువొత్తియూరు: కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడిని కన్యాకుమారి పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. కన్యాకుమారి జిల్లా కులశేఖరం సమీపం చిట్టారు పట్టణం కాలువలో మహిళ మృతదేహాన్ని పోలీసులు గత 20వ తేదీ స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తిరువిట్టార్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా మృతి చెందిన మహిళ పినంతోడు తెక్కల్‌ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్‌ భార్య లిల్లీబాయ్‌ (41) అని తెలిసింది. ఆమె కులశేఖరంలో జౌలి దుకాణంలో పని చేస్తున్నట్టు తెలిసింది. ఈ హత్య కేసుకు సంబంధించి పినంతోడు ప్రాంతంలో సెల్‌ఫోన్‌ దుకాణం నడుపుతున్న యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అతనికి లిల్లీబాయ్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది.

పోలీసులు అతని వద్ద తమదైన శైలిలో విచారించగా హత్య చేసినట్టు నేరం అంగీకరించాడు. పక్కపక్కన ఇళ్లలో నివాసం ఉంటున్న వారి మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరూ కారులో మద్యం తాగి పలు చోట్లకు ఉల్లాసంగా తిరిగారు. ప్రియుడికి లిల్లీబాయి కోరినప్పుడల్లా నగలు, నగదు ఇచ్చారు. కొన్నాళ్ల తరువాత ఆమె ఇచ్చిన నగలు, నగదు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేసింది. దీంతో ఆమె వేధింపులు తట్టుకోలేక కారులో వెళుతున్న సమయంలో ఆమెకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చాడు. కొద్ది సమయం తరువాత తాగడానికి నీరు అడగ్గా తిరిగి విషం కలిపిన నీటిని ఆమెకు ఇచ్చాడు. కొద్ది సమయానికే లిల్లీబాయి మృతి చెందడంతో మృతదేహాన్ని కాలువలో పడవేసి పారిపోయినట్టు తెలిపాడు. పోలీసుల విచారణలో లిల్లీబాయి ప్రియుడికి ఇంతకుమునుపే వివాహం అయి భార్య, బిడ్డ ఉన్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement