వైద్యం కోసం వచ్చి దాడి చేశారు | Man Attack On Doctor And Compounder | Sakshi
Sakshi News home page

వైద్యం కోసం వచ్చి దాడి చేశారు

Mar 23 2018 12:01 PM | Updated on Mar 23 2018 12:01 PM

Man Attack On Doctor And Compounder - Sakshi

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైద్యులు

రాయచోటి టౌన్‌ : వైద్యం కోసం వచ్చి తమపై దాడి చేశారంటూ రాయచోటి పట్టణానికి చెందిన ఓ వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్బన్‌ సీఐ మహేశ్వరరెడ్డి కథనం మేరకు..రాయచోటి పట్టణ పరిధిలోని చంద్రశేఖర్‌ రెడ్డి ( చిన్న పిల్లల డాక్టర్‌) వద్ద  భాస్కర్‌ రెడ్డి అనే వ్యకి కాంపౌండర్‌గా పనిచేస్తున్నారు. గురువారం పట్టణానికి చెందిన ప్రతాప్‌ అనే వ్యక్తి ఆస్పత్రికి తన భార్య, బిడ్డతో వెళ్లాడు. ఈ క్రమంలో ఆస్పత్రిలో పని చేస్తున్న కాంపౌండర్‌ భాస్కర్‌ రెడ్డికి, ప్రతాప్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అతను వైద్యుడు చంద్రశేఖర్‌రెడ్డితో పాటు కాంపౌండర్‌పై దాడికి యత్నించాడు. విషయం తెలుసుకున్న రాయచోటి డాక్టర్స్‌ అసోసియేషన్‌  సభ్యులు వైద్యుడికి మద్దతుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాము దాడి చేయలేదని ఆస్పత్రికి వైద్యం కోసం వెళితే తనతో పాటు తన భార్యపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు దురుసుగా మాట్లాడారని వైద్యం కోసం వచ్చిన ప్రతాప్, బాలగురవయ్య, సుజాత, అశోక్‌లు డాక్టర్, కాంపౌండర్‌పై ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదును స్వీకరించి విచారణ  చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement