రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే భర్త | Husband of BJP MLA Sangeeta Charel and his aides thrash toll plaza employee | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే భర్త

Oct 28 2017 1:26 PM | Updated on Mar 28 2019 8:41 PM

Husband of BJP MLA Sangeeta Charel and his aides thrash toll plaza employee  - Sakshi

భోపాల్‌ : ఓ బీజేపీ ఎమ్మెల్యే భర్త రెచ్చిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో బీజేపీ ఎమ్మెల్యే  సంగీత చరెల్‌ భర్త అగర్వా టోల్‌ ఫ్లాజా వద్ద సిబ్బందిపై దాడి చేశాడు. టోల్‌ వసూలు చేస్తోన్న వ్యక్తిని చితకబాదారు. అంతటితో ఆగకుండా మేనేజర్‌ చాంబర్‌లోకి వెళ్లి అతనిపైనా చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యే భర్త విజయ్‌ చరెల్ గురువారం రాత్రి 11 గంటల సమయంలో మరో ముగ్గురితో కలిసి టోల్‌ ఫ్లాజా వద్దకు వచ్చారు‌. టోల్‌ రుసుం చెల్లింపు విషయంలో సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోతూ సిబ్బందిపై దాడిచేసి, అనంతరం వాహనంలో పరారయ్యారు. ఈ ఘటన మొత్తం టోల్‌ఫ్లాజాలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. టోల్‌ ఫ్లాజా మేనేజర్‌ ఫిర్యాదుమేరకు ఎమ్మెల్యే భర్త సహా నలుగిరిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement