ఆస్తి కోసమే తమ్ముడి హత్య

Brother Killed For Assets - Sakshi

రామాంజనేయులు బాబుది కిరాయి హత్యగా నిర్ధారణ  

10 మంది నిందితులనుఅరెస్టు చేసిన పోలీసులు

ఒక హత్యకేసు తవ్వితే మరొకటి బట్టబయలు

మదనపల్లె క్రైం: సంచలనం కలిగించిన ఆకుల రామాంజనేయులు బాబు హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన కిరాయి హంతకులతో పాటు మృతుని అన్న ఆంజనేయులు సహా 10 మంది నిందితులను ఒకటి, రెండవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి, సీఐ లు నిరంజన్‌ కుమార్, సురేష్‌ కుమార్‌ మంగళవారం వెల్లడించారు. పట్టణంలోని సుభాస్‌ రోడ్డుకు చెందిన మాజీ సైనికుడు ఆకుల సిద్ధప్ప కుమారుడు రామాంజు లు బాబు(50)ని ఈనెల 13 రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారన్నారు. ఈ హత్యలో  సీటీఎం మండలానికి చెందిన మృతుని అన్న ఆకుల ఆంజనేయులు హస్తం ఉందన్న అనుమానంతో వన్‌టౌన్‌ సీఐ నిరంజన్‌ కుమార్, ఎస్‌ఐ సుమన్‌తో పాటు సిబ్బంది దర్యాప్తును వేగవంతం చేశారు.

హత్యకు పథకం ఇలా..
మాజీ సైనికుడైన ఆకుల సిద్ధప్పకు ప్రభుత్వం మాజీ సైనికుల కోటాలో బి.కె.పల్లె పంచాయతీలో ఐదెకరాల పొలాన్ని మంజూరు చేసింది. ఆయనకు నలుగురు సంతానం. మొదటి కుమారుడైన ఆంజనేయులు 35 ఏళ్ల క్రితమే తండ్రితో విడిపోయి సీటీఎంలో కాపురం ఉంటున్నాడు. ఆకుల సిద్ధప్ప తన ఆస్తిని ఇద్దరు కుమార్తెలు, చిన్న కొడుకు రామాంజులు పేర్ల మీద వీలునామా రాసి చనిపోయాడన్నారు. తనకూ ఆస్తిలో భాగం ఉందని, తన వాటా తనకు ఇవ్వాలని ఆంజనేయులు తమ్ముడితో వాధించాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగడం, పోలీసు స్టేషన్, కోర్టుల వరకు వెళ్లడం జరిగాయి. ఈ క్రమంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురైన ఆంజనేయులు ఎలాగైనా తమ్ముడి వద్ద నుంచి ఆస్తి వచ్చేలా చేయాలని జహా చేనేతనగర్‌కు చెందిన రౌడీషీటర్‌ రఘుపతినాయుడుని సంప్రదిం చాడు. రఘుపతి అంగళ్లుకు చెందిన సుజాతా రాణిని కలిసి ఆస్తిని ఇప్పించగలిగితే.. దాన్ని ముగ్గురం సమానంగా పంచు కుందామని ఆశచూపాడు. తర్వాత వీరు ముగ్గురు కలిసి రామాంజనేయులను అనేక సార్లు కలిసి సర్దుకుపోవాలని సూచించారు. అయితే ఎంత టికీ అతడు వినకపోవడంతో రఘపతి నాయుడు తన అనుచరులైన దేవీ వరప్రసాద్, గంగాధరం, పవన్, రామచంద్ర, వెంకటేష్‌ సహాయంతో రామాంజనేయుల కదలికలపై నిఘా ఉంచారు. ఈనెల13న రాత్రి ఇంటికి స్కూటర్‌లో వెళుతుండగా పవన్‌ క్రూజర్‌ వాహనంతో వెనుక వైపు నుంచి స్కూటీని ఢీ కొట్టాడు. కిందపడ్డ రామాంజులను దేవా తలపై రాడ్‌తో కొట్టి గాయపరిచాడు. గంగాధరం తలపై రాయితో మోదా డు. అనంతరం నిందితులు పారిపోయారు.

వెలుగులోకి మరో కేసు..
కాగా ఈ కేసు పరిష్కారించే క్రమంలో నిందితులను పట్టుకుని విచారించినప్పుడు మరో కేసుకు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. అంగళ్లుకు చెందిన సుజాతా రాణికి వరుసకు బావ అయిన సీతారామయ్యతో ఆస్తి గొడవలు ఉన్నాయి. సీతారామయ్య తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తుండటంతో ఇదివరకే పరిచ యం ఉన్న రఘుపతినాయుడిని కలిసి మొర పెట్టుకుంది. దీంతో సీతారామయ్యను హత్య చేసేందు కు తన అనుచరులైన దేవా, మధుకర్, రామ్మోహన్, గంగాధరం సహాయంతో రఘుపతి పథకం వేశాడు. 3.9.2017న స్నేహితుడు రామకృష్ణా రెడ్డితో కలిసి వాకింగ్‌కు వెళ్లిన సీతారామయ్యను వెంబడించి విషం కలిపిన నీళ్లను బలవంతంగా తాగించారు. రామకృష్ణారెడ్డిని ఈ విషయం ఎక్కడైనా చెపితే చంపేస్తామని బెదిరించి, గుండె పోటుతో సీతారామయ్య చనిపోయాడని అందరినీ నమ్మించారు. ఇందుకు గాను రఘుపతికి సుజా తారాణి రూ.8 లక్షల పైకం ముట్టజెప్పినట్లు పేర్కొన్నారు. రామాంజులు బాబు హత్యతో ఈ విషయం వెలుగులోకి రావడంతో ముదివేడు పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. కాగా నిందితులపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. కేసును చేధించిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top