ఇంటూరులో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్‌

Boy Kidnap In Inturu Guntur - Sakshi

అమృతలూరు(వేమూరు): రోడ్డుపై ఆడుకుం టున్న ఆరేళ్ల బాలుడిని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తులు కిడ్నాప్‌ చేసిన ఘటన అమృతలూరు మండలం ఇంటూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని లాకుల వద్ద తెనాలి – చందోలు ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి పక్కనే తాత్కాలిక పాకలు ఏర్పాటుచేసుకుని కొందరు యానాదులు జీవనం సాగిస్తున్నారు. వారు పదేళ్ల క్రితం చెరుకుపల్లి నుంచి వచ్చి ఉంటున్నారు. వారిలో నక్కా సుబ్బారావు, నాంచారమ్మ దంపతులకు ఆరేళ్ల కుమారుడు స్వామియేలు, రెండేళ్ల కుమార్తె దీవెన ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా స్వామియేలు లాకుల సమీపంలోని దళితవాడ వద్ద చెరుకుపల్లి – పొన్నూరు రోడ్డుపై ఆడుకుంటుండగా శనివారం మధ్యాహ్న సమయంలో పొన్నూరు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న గుర్తుతెలియని మహిళ, పురుషుడు పిల్లాడిని బైక్‌పై ఎక్కించుకుని చందోలు వైపు వెళ్లిపోయారు.

దీనిని చూసిన వారు సుబ్బారావు, నాంచారమ్మ దంపతులకు చెప్పారు. నింది తుల వయసు 25 నుంచి 30 ఏళ్ల లోపు ఉంటుంది. దీంతో శనివారం రాత్రి స్వామియేలు తల్లి నాంచారమ్మ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ జె.క్రాంతికిరణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి సేకరించి వివరాల ప్రకారం  నాంచారమ్మ మొదటి భర్త తాలూకా ఇంటికి వెళ్లి ఎస్‌ఐ క్రాంతికిరణ్‌ విచారించారు. వారు ఎత్తుకెళ్లలేదని తేలడంతో పోలీసులు సీసీ పుటేజీల ద్వారా నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులను కచ్చితంగా పట్టుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top