సున్నపు క్వారీలో ప్రమాదం: ఆరుగురు మృతి | Accident In Limestone Quarry 6 Assassinated And Four Injured | Sakshi
Sakshi News home page

సున్నపు క్వారీలో ప్రమాదం: ఆరుగురు మృతి

Jun 14 2020 11:13 AM | Updated on Jun 14 2020 11:21 AM

Accident In Limestone Quarry 6 Assassinated And Four Injured - Sakshi

సహాయక చర్యల్లో అధికారులు

దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో వ్యక్తి...

భోపాల్‌ : సున్నపురాయి క్వారీలో ప్రమాదం జరిగిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ పస్‌గరిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం మధ్యాహ్నం పస్‌గరి ఏరియా, పప్‌రేడీ గ్రామంలోని ఓ సున్నాపురాయి క్వారీలో 20 మంది కూలీలు పనిచేస్తున్నారు. సున్నపురాయి తవ్వుతుండగా పెద్ద మొత్తంలో పెళ్లలు విరిగి కూలీలపై పడ్డాయి. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో వ్యక్తి గాయాలపాలై ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మరణించాడు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. ( ఎంత పనిచేశావమ్మా..! )

మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మిగిలిన 10 మంది ప్రమాదం నుంచి తప్పించుకుని క్షేమంగా బయటపడ్డారు. క్షతగాత్రులను వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు అధి​కారులు. ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ క్వారీ మూసేయాలని ఆదేశించారు. మృతుల అంత్యక్రియలు నిర్వహించటానికి వారి కుటుంబాలకు ఐదు వేల రూపాయల సహాయం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement