breaking news
Limestone excavation
-
సున్నపు క్వారీలో ప్రమాదం: ఆరుగురు మృతి
భోపాల్ : సున్నపురాయి క్వారీలో ప్రమాదం జరిగిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ పస్గరిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం మధ్యాహ్నం పస్‌గరి ఏరియా, పప్‌రేడీ గ్రామంలోని ఓ సున్నాపురాయి క్వారీలో 20 మంది కూలీలు పనిచేస్తున్నారు. సున్నపురాయి తవ్వుతుండగా పెద్ద మొత్తంలో పెళ్లలు విరిగి కూలీలపై పడ్డాయి. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో వ్యక్తి గాయాలపాలై ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మరణించాడు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. ( ఎంత పనిచేశావమ్మా..! ) మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మిగిలిన 10 మంది ప్రమాదం నుంచి తప్పించుకుని క్షేమంగా బయటపడ్డారు. క్షతగాత్రులను వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ క్వారీ మూసేయాలని ఆదేశించారు. మృతుల అంత్యక్రియలు నిర్వహించటానికి వారి కుటుంబాలకు ఐదు వేల రూపాయల సహాయం అందించారు. -
టీడీపీ ఎమ్మెల్యే వై.శ్రీనివాసరావు అక్రమ మైనింగ్
హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం సాక్షి, హైదరాబాద్: ఏపీలో అధికార పార్టీకి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమంగా లైమ్‌స్టోన్ తవ్వకాలు, రవాణా చేస్తూ, ప్రభుత్వానికి రూ.కోట్లలో రాయల్టీ ఎగవేస్తున్నారని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అక్రమంగా లైమ్‌స్టోన్ తవ్వకాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేయడంతోపాటు అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిరోధించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిడుగురాళ్లకు చెందిన కుందుర్తి గురవాచారి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో పరిశ్రమలు, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే వై.శ్రీనివాసరావు, సీబీఐ జాయింట్ డెరైక్టర్, గనులశాఖ అసిస్టెంట్ డెరైక్టర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు స్థానిక టీడీపీ నేతలతో కలసి పిడుగురాళ్ల, నడికుడి, కానస్నపల్లి, దాచేపల్లి, కొండమోడులతోపాటు పలు గ్రామాల్లో గత రెండేళ్లుగా ప్రభుత్వ భూములు, జేపీ సిమెం ట్స్‌కు లీజుకిచ్చిన భూముల్లో అనుమతులు తీసుకోకుండా లైమ్‌స్టోన్ తవ్వకాలు చేస్తున్నారని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు.